దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు: నిర్మల
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:39 AM

బడ్జెట్ 2026–27లో టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. సహజ ఫైబర్ల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో న్యాచురల్ ఫైబర్ స్కీమ్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. టెక్స్‌టైల్ పరిశ్రమ విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ను అమలు చేయనుంది. అలాగే చేనేతలు, హస్తకళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికి నేషనల్ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్ను కూడా బడ్జెట్‌లో ప్రకటించింది. ఇవి గ్రామీణ ఉపాధి, సంప్రదాయ కళల పరిరక్షణకు దోహదపడనున్నాయి.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిలకడగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రధాని ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరాభివృద్ధికి ఆరు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. యువశక్తిపై దృష్టి పెట్టిన ఈ బడ్జెట్ ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా ఉందని, ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత్ వేగంగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఎగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తామని వెల్లడించారు.

Latest News
'Victory is certain': Vijay to cadres as TVK marks 3rd anniversary Mon, Feb 02, 2026, 11:35 AM
US experts back India's growth, urge manufacturing push Mon, Feb 02, 2026, 11:30 AM
Pakistan has not targeted BCCI, it has taken the issue to ICC: Rashid Latif Mon, Feb 02, 2026, 11:09 AM
PM Modi lauds Annapurna Devi's efforts for women and children's welfare on her birthday Mon, Feb 02, 2026, 11:04 AM
Budget to make India a global hub for innovation, advanced manufacturing: SBI Chairman Mon, Feb 02, 2026, 11:03 AM