|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:37 PM
కేంద్ర బడ్జెట్ తయారీ విధి విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 30 మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు లోక్ సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని వారు ప్రత్యక్షంగా వినే అవకాశం కల్పించారు. లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ప్రసంగం వినే అవకాశం వారికి కల్పించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.బడ్జెట్ ప్రసంగం తర్వాత విద్యార్థులకు కర్తవ్య భవన్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను సందర్శించే అవకాశం కల్పించినట్లు వివరించాయి. ఆర్థిక శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, అత్యున్నత స్థాయిల్లో ఆర్థిక నిర్ణయాలు ఎలా రూపొందిస్తారు, అమలు చేస్తారు అనే విషయాలను ఆ విద్యార్థులు తెలుసుకోనున్నారు.
Latest News