|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:24 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఇది దేశ వృద్ధికి, దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా ఉన్న సమతుల్య బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ఈ బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, క్రిటికల్ మినరల్ కారిడార్, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు వంటి కీలక ప్రతిపాదనలు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రోత్సాహం, పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వంటివి ఏపీకి సానుకూల అంశాలని పేర్కొన్నారు.
Latest News