|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:51 PM
విద్యుత్తు తీగల కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ దివ్యాంగుడు సజీవదహనమైన హృదయ విదారక ఘటన ఇది. పెదవేగి మండలం వేగవరం గ్రామానికి చెందిన పామర్తి మల్లికార్జున (35) దివ్యాంగుడు. కొబ్బరికాయల విక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. శనివారం తడికలపూడిలోని తోటలో కొబ్బరి కోతకు కూలీలతో కలిసి వెళ్లారు. కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలు లారీకి తగిలి.. మంటలు వ్యాపించాయి. అతనితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందకు దూకి తప్పించుకోగా.. మల్లికార్జున మంటల్లో సజీవదహనమయ్యారు. క్షణాల్లోనే లారీలో మంటలు వ్యాపించాయి. దీంతో లారీపై కూర్చున్న మల్లికార్జునకు మంటలు అంటుకుని సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఏలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Latest News