|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:12 PM
ఆర్థిక వృద్ధి కొనసాగాలన్నదే తమ ప్లాన్ అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నేటి బడ్జెట్ పై ఆమె స్పందించారు. ఆర్థిక వృద్ధి కోసం సిస్టమ్ లో మార్పులు చేస్తున్నామని, మున్ముందూ జరుగుతూనే ఉంటాయని అన్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని.. దానికి తగ్గ వాతావరణాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సామాన్యుడికి ఉపయోగపడేలా చూస్తామన్నారు. క్యాపెక్స్ ను భారీగా పెంచామని గుర్తుచేశారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మధ్యాహ్నం 12.25కే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. చాలా త్వరగా ముగించారు. ఐతే.. ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
Latest News