టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:48 PM

తిరుమల తిరుపతి దేవస్థానం  కార్యనిర్వహణాధికారి  అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు  ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM