|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 06:10 PM
అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో "#నోహెల్మెట్ – #నోపెట్రోల్" నిబంధన అమలు ప్రారంభమైంది. ఈ సందర్భంగా, హెల్మెట్ ధరించి పెట్రోల్ వేయించుకునే ద్విచక్ర వాహనదారులను ప్రోత్సహించడానికి అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎం.జి. పెట్రోల్ బంక్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు సిల్వర్ కాయిన్లు, రోజా పూలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
Latest News