|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:53 AM
మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పద్మావతీపురంలో భూమన కరుణాకర రెడ్డి నివాసం వద్ద రోడ్డుపై కూర్చుని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ..“అంబటి రాంబాబుపై నిన్న జరిగిన దాడి ఒక వ్యక్తిపై కాదు… ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి” అని స్పష్టం చేశారు.ఇరు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు, మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుపై దాడి అత్యంత హేయమైనదని, నీచమైన చర్య అని ఆయన మండిపడ్డారు.“జల్లికట్టులో ఎద్దులు లాగా అంబటి ఇంటిపై ఎగబడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది రాజకీయ దాడి కాదు… ఇది హంతక ముఠా చర్య” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తు చేసిన భూమన,“వివరణ ఇచ్చినప్పటికీ ఆయన ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించడం పూర్తిగా దుర్మార్గం” అని అన్నారు.
Latest News