అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:23 PM

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు శనివారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.విషయంలోకి వెళితే.. గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద శుక్రవారం తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ‘మహాపాపం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు.. 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలని హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే మార్గంలో కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచే తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్నవారు వీడియోగా రికార్డు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూటమి శ్రేణులు కారుపై కర్రలు, పిడిగుద్దులతో దాడి చేశాయి. అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా అంబటి వినిపించుకోకుండా మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు అద్దం దించి సీఎం చంద్రబాబుపై  తీవ్ర పరుష పదజాలంతో దూషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గుంటూరు సిద్ధార్థనగర్‌లో అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై శనివారం సాయంత్రం దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబటిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్సై కె. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు ఆయనను తరలించారు. విచారణ, వైద్య పరీక్షల ఆనంతరం ఆదివారం రాత్రి న్యాయాధికారి ముందు అంబటిని పోలీసులు హాజరుపర్చగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయాధికారి ఆదేశాలతో అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. 

Latest News
10 semiconductor projects approved, 4 reach pilot production: Minister Wed, Feb 04, 2026, 04:40 PM
BJP-JD(S) harassing Dalit Minister, alleges Karnataka Deputy CM Shivakumar amid overnight protest Wed, Feb 04, 2026, 04:35 PM
Bihar RJD chief Mangani Lal Mandal hospitalised in Delhi for liver treatment Wed, Feb 04, 2026, 04:34 PM
Japanese researchers to begin human trial for Nipah vaccine in April Wed, Feb 04, 2026, 04:32 PM
PM Modi to visit Malaysia this week as both countries look at bolstering strategic ties Wed, Feb 04, 2026, 04:31 PM