|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 01:54 PM
వాట్సాప్–మెటా గోప్యతా విధానంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించి, కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని మెటాతో పంచుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. డేటా షేరింగ్ గోప్యతా హక్కులకు భంగం కలిగించే ప్రమాదముందని పేర్కొంది. ‘‘ఈ దేశ గోప్యతతో ఆడుకునే హక్కు మెటాకు లేదు’’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వినియోగదారుల డేటాను వాణిజ్య లాభాల కోసం వాడటం సరికాదని అభిప్రాయపడింది. ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారించనున్నట్లు ప్రకటించింది.
Latest News