కూటమి ఆటవిక పాలనను భరించేందుకు సిద్ధంగా ఉన్నాం
 

by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:40 PM

వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీని రావణకాష్ఠంగా మార్చారని మండిపడ్డారు. మరో మూడేళ్ల పాటు ఆటవిక పాలనను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. కాపు, బీసే నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అనిల్ విమర్శించారు. తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేసి అడ్డంగా దొరికేశారని... దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి సవాలు విసరాలని ఛాలెంజ్ చేశారు.

Latest News
Uproar in RS as BJP MP says tribal candidate in Telangana committed suicide under pressure Tue, Feb 10, 2026, 12:23 PM
UN chief concerned over attacks on journalists ahead of Bangladesh elections: Spokesperson Tue, Feb 10, 2026, 12:11 PM
Epstein's ties to scientists 'deeper than previously known': Report Tue, Feb 10, 2026, 12:07 PM
Bangladesh editors' body flags threats to press freedom ahead of elections Tue, Feb 10, 2026, 12:01 PM
'No WAGs' policy intact for Indian players in T20 WC: Report Tue, Feb 10, 2026, 11:59 AM