గూగుల్ సరిక్రొత్త ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:57 PM

గూగుల్, భారత్‌లోని తన యూజర్ల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌ను బుధవారం ప్రారంభించింది. గూగుల్ ఫోటోస్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌తో, ఇకపై కేవలం వాయిస్ లేదా టెక్స్ట్ ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించడానికి, యూజర్లు తమకు నచ్చిన ఫోటోను ఓపెన్ చేసి, 'హెల్ప్ మీ ఎడిట్' అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత, "బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చెయ్యి" లేదా "రంగులు ప్రకాశవంతంగా మార్చు" వంటి ఆదేశాలను వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో ఇవ్వొచ్చు. గూగుల్ జెమిని ఏఐ సామర్థ్యాలతో ఈ మార్పులు సెకన్లలో జరిగిపోతాయి.ఈ ఫీచర్‌లో భాగంగా 'పర్సనలైజ్డ్ ఎడిట్స్' అనే ప్రత్యేక సౌకర్యాన్ని కూడా గూగుల్ పరిచయం చేసింది. దీని ద్వారా ఫోటోల్లోని స్నేహితుల కళ్లద్దాలు తీసివేయడం, మూసుకుపోయిన కళ్లను తెరవడం లేదా వారిని నవ్వేలా చేయడం వంటి మార్పులు చేయవచ్చు. ఇందుకోసం యూజర్ ప్రైవేట్ ఫేస్ గ్రూపుల్లోని ఇతర చిత్రాలను ఏఐ ఉపయోగించుకుంటుంది.ఈ కొత్త ఫీచర్ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

Latest News
India, Greece discuss enhancing maritime cooperation Mon, Feb 16, 2026, 03:54 PM
AI Impact Summit 2026 puts India on global AI map: Raghav Chadha Mon, Feb 16, 2026, 03:40 PM
Auditors are custodians of public trust: President Murmu Mon, Feb 16, 2026, 03:38 PM
The game was out of Pakistan's reach once India reached 175: Waqar Younis Mon, Feb 16, 2026, 03:36 PM
T20 WC: England elect to bat against Italy; both sides unchanged Mon, Feb 16, 2026, 03:19 PM