సూర్యుడి నుంచి భూమి వైపు సౌర జ్వాలలు: భారత్ కు ముప్పు!
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:13 PM

భానుడు మహోగ్రరూపం దాల్చడంతో శక్తివంతమైన సౌర జ్వాలలు వెలువడుతున్నాయని ఇస్రో తెలిపింది. ఈ పరిణామాలను ప్రపంచ అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. సౌర జ్వాలల ప్రభావంతో భారత్‌లో రేడియో బ్లాక్‌అవుట్‌లు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన సౌర తుఫానులు భూమివైపు వస్తే ఉపగ్రహాలు, టీవీ సిగ్నల్స్, రాడార్లు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 1న X8.1 స్థాయి సౌర విస్ఫోటనం నమోదైంది. ఆదిత్య-L1 డేటాతో ముందస్తు హెచ్చరికలు జారీ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.అంతరిక్షంలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన 50కి పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర తుఫాను సమయంలో వెలువడే రేడియేషన్ వల్ల ఈ శాటిలైట్లలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇస్రో టెలిమెట్రీ నెట్‌వర్క్ (ISTRAC) ఈ ఉపగ్రహాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఒకవేళ కమ్యూనికేషన్‌లో ఏదైనా అంతరాయం కలిగినా లేదా టెక్నికల్ సమస్యలు తలెత్తినా వెంటనే సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ నుంచి అప్రమత్తంగా ఉన్నారు.

Latest News
Ready-made garment export figures show resilience of apparel sector: AEPC Tue, Feb 17, 2026, 02:23 PM
T20 WC: SA seek perfect ending to Group D campaign against spirited UAE Tue, Feb 17, 2026, 02:21 PM
Congress workers march to UP Assembly over MGNREGA issue, several detained Tue, Feb 17, 2026, 02:07 PM
Son-in-law beats father-in-law to death with hockey stick in UP; elderly sister injured in attack Tue, Feb 17, 2026, 01:59 PM
Trump backs US-Iran talks in Geneva, cautions of fallout if efforts collapse Tue, Feb 17, 2026, 01:58 PM