2020-24 మధ్య కాలంలో ఎయిడ్స్ కారణంగా దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది మృతి
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:16 PM

ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఐటీ రంగంలో హెచ్ఐవీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ వ్యవస్థ వెల్లడించింది. విదేశీ తరహా జీవనశైలికి అలవాటు పడటం ఐటీ రంగంలో హెఐవీ వ్యాప్తి కావడానికి కారణమవుతోందని తెలిపింది. ఈ రంగంలో హెచ్ఐవీ పరీక్షల సంఖ్యలను పెంచాల్సి ఉందని సూచించింది.

Latest News
Four children suffer burns after drum filled with chemicals explode in Bengal's Canning Wed, Feb 18, 2026, 11:11 AM
Delhi wakes up to light rain as AQI stays in 'poor' category Wed, Feb 18, 2026, 11:08 AM
T20 WC: SA elect to bowl first against UAE Wed, Feb 18, 2026, 11:04 AM
PM Modi, French President Macron begin talks in Mumbai Tue, Feb 17, 2026, 04:43 PM
Reels, speed and a deadly crash: Mother seeks accountability after minor kills her son in Delhi Tue, Feb 17, 2026, 04:42 PM