ఫైనాన్స్‌లో కారు కొన్నారా? .... అందుకోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లక్కర్లేదు
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:05 PM

మీరు ఫైనాన్స్‌లో (బ్యాంకులో లోన్ తీసుకుని) కారు కొనుగోలు చేసినట్లియతే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కార్డుపై హైపొతికేషన్ క్లాజ్‌లో ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంక్ పేరు ఉంటుంది. అది మీ కారు తాఖట్టులో ఉందని తెలుపుతుంది. అయితే, లోన్ మొత్తం తిరిగి చెల్లించిన వాహనదారులు ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లి హైపొతికేషన్ తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే, ఇకపై అలాంటి ఇబ్బందులు ఏం లేవు. లోన్లో కారు, ఇతర వెహికల్ కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వ శుభవార్త అందించింది. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నుంచి లోన్ హైపొతికేషన్ తొలగించుకునే ప్రాసెస్ సులభతరం చేసింది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ఆర్‌సీ కార్డులో మీ కారు తాఖట్టులో లేదని అప్డేట్ చేసుకునే ప్రక్రియను హైపొతికేషన్ టర్మినేషన్ అంటారు. మీరు మీ కారును విక్రయించాలన్నా, ఓనర్‌షిప్ మార్చుకోవాలన్నా లేదా మీ ఆర్‌సీలో కారు మీ పేరుపైనే ఉందని మార్చుకునేందుకైనా హైపొతికేషన్ టర్మినేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. తమ లోన్ మొత్తం తిరిగి చెల్లించిన వెహికల్ ఓనర్లు ఇకపై ఇంటి నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసి కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. అవసరమైన ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్లో ఫారం 35 సమర్పించి దరఖాస్తు చేసినా ఫిజికల్ ఫారాలను ఆర్‌టీఓ ఆఫీసులో సమర్పించాల్సిన రూల్ ఉంది. మరి ఈ ప్రాంతంలో ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకోవడం మంచిది.


లోన్ హైపొతికేషన్ టర్మినేషన్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆర్‌టీఓ ఫారం 35, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆర్‌సీ ఉండాలి.


ముందుగా వాహన్ పొర్టల్ vahan.parivahan.gov.in/vahaneservice/ లోకి లాగిన్ కావాలి


లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్ లో వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి


మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి


మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి


హైపొతికేషన్ టర్మినేషన్ ఎంచుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి


లెఫ్ట్ సైడ్ కనిపించే సర్వీస్ డీటెయిల్స్‌లో హైపొతికేషన్ టర్మినేషన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.


సర్వీసెస్ డీటెయిల్స్‌లో ఉన్న ఇన్సూరెన్స్ డీడేయిల్స్‌పై క్లిక్ చేయాలి. వివరాలు అందించి సబ్మిట్ బటన్ నొక్కాలి.


డీఎంఎస్ పై క్లిక్ చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.


సర్వీసెస్ డీటెయిల్స్‌లోని ఫీ డీటేయిల్స్‌ పై క్లిక్ చేసి ఫీ చెల్లించాలి.


సబ్మిట్ చేసినట్లయితే మీ ప్రాసెస్ పూర్తవుతుంది.

Latest News
Qualcomm, Tata Electronics to produce automotive modules in India Fri, Feb 20, 2026, 03:24 PM
'I won’t bat 15 overs to correct poor form and ignore the game': Jos Buttler Fri, Feb 20, 2026, 03:04 PM
Delhi Police say taking legal action after Youth Cong members breach security at AI summit Fri, Feb 20, 2026, 02:59 PM
Historic milestone for bilateral ties: Slovakia President after meeting PM Modi Fri, Feb 20, 2026, 02:48 PM
After past mistakes, Congress found Tamil Nadu toehold though allies but trouble brews ahead of polls Fri, Feb 20, 2026, 02:44 PM