పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ఇద్దరు గల్లంతు
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:08 PM

 బాపట్ల జిల్లాలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. చినగంజాం మండలం పల్లిపాలెం బీచ్(Pallipalem Beach)లో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుల్లో భాగంగా నలుగురు విద్యార్థులు(Studens) బీచ్‌‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా సముద్ర కెరటాలు విరుచుకుపడటంతో నలుగురు విద్యార్థులు శ్రీరామ్, అవినాశ్, హేమసాయి , హేమ వర్ధన్ గల్లంతయ్యారు. అయితే వీరిలో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరామ్, అవినాశ్ మాత్రం సముద్రపు నీటిలో కొట్టుకుపోయారు. పుట్టిన రోజునే శ్రీరామ్ ప్రమాదంలో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు, ఈతగాళ్ల సాయంతో శ్రీరామ్, అవినాశ్ కోసం గాలిస్తున్నారు. విద్యార్థులందరూ ఇంకొల్లు మండలం దద్దుకూరులో జడ్పీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నట్లు గుర్తించారు.

Latest News
Sensex, Nifty trade with strong gains over US tariff developments Mon, Feb 23, 2026, 12:58 PM
Bangladesh: BNP leader injured in shooting in Dhaka’s Kalabagan area Mon, Feb 23, 2026, 12:53 PM
Mexico kills drug kingpin El Mencho, violence erupts Mon, Feb 23, 2026, 12:43 PM
Precious metals surge over growing geopolitical tensions Mon, Feb 23, 2026, 12:35 PM
Sadhvi Prem Baisa death case: Compounder arrested, released on bail the same day Mon, Feb 23, 2026, 12:32 PM