లోక్‌సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలని శశి థరూర్ డిమాండ్
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:13 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేతకు సభలో మాట్లాడే పూర్తి హక్కు ఉంటుందని దాన్ని కాలరాయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన అన్నారు. గురువారం ఈ విషయంపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ప్రసంగానికి అభ్యంతరాలు చెప్పడం ద్వారా అధికార పక్షం ఒక చిన్న విషయాన్ని పెద్ద పార్లమెంటరీ సమస్యగా మార్చిందని విమర్శించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఇప్పటికే బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే ఉటంకిస్తున్నారని థరూర్ గుర్తుచేశారు.ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వాలి. ఆయన ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమైన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. అది రహస్య సమాచారమేమీ కాదు. తన వాదన వినిపించిన తర్వాత ఆయన రాష్ట్రపతి ప్రసంగంలోని ఇతర అంశాలపైకి వెళ్లేవారు. కానీ, అనవసరంగా పెద్ద అభ్యంతరాలు లేవనెత్తి, ఆయనను మాట్లాడకుండా చేయడం ద్వారా సభలో చాలా పెద్ద సమస్యను సృష్టించారు అని థరూర్ వివరించారు.ఈ సందర్భంగా, తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి కూడా థరూర్ వెల్లడించారు. బుధవారం పార్లమెంటు ప్రాంగణం వెలుపల తాను నడుస్తుండగా జారి కిందపడ్డానని, దురదృష్టవశాత్తు ఈ ఘటనలో తన కాలికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. ఈ కారణంగానే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని, అందుకే పార్టీ అంతర్గత సమావేశంలో చర్చలకు హాజరుకాలేకపోయానని, ఇందుకు క్షమించాలని కోరారు.గాయమైనప్పటికీ తన అధికారిక విధులకు ఎలాంటి ఆటంకం కలగదని ఆయన స్పష్టం చేశారు.నేను ప్రతిరోజూ పార్లమెంటుకు వస్తాను. వచ్చే వారం జరగబోయే కమిటీ సమావేశాల్లోనూ పాల్గొంటాను. కాకపోతే, దురదృష్టవశాత్తు వీల్‌చైర్‌లో రావాల్సి ఉంటుంది అని తన నిబద్ధతను చాటుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతల గొంతును ప్రభుత్వం నొక్కివేస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శశి థరూర్ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు రాజకీయంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, మరోవైపు వ్యక్తిగత అస్వస్థతను సైతం లెక్కచేయకుండా విధులకు హాజరవుతానని ఆయన చెప్పడం గమనార్హం.

Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM