అమెరికాతో భారత్ డీల్‌పై రష్యా సానుకూల స్పందన
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:11 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వస్తున్న ఊహాగానాలకు మాస్కో తెరదించింది. భారత్ తన శక్తి అవసరాల కోసం ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని, ఈ విషయంలో తాము ఎటువంటి ఆందోళన చెందడం లేదని రష్యా స్పష్టం చేసింది.


"ఇందులో కొత్తేమీ లేదు": రష్యా స్పందన


రష్యాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, ఇంధన రంగంలో తమ మధ్య ఉన్న బంధం ఇరు దేశాలకు ప్రయోజనకరమని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. "భారత్ ఎప్పుడూ రష్యా నుంచే చమురు కొనడం లేదు. ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరఫరాదారులను మార్చుకోవడంలో భారత్‌కు పూర్తి సార్వభౌమ అధికారం ఉంది" అని వ్యాఖ్యానించారు.


ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన భేటీ తర్వాత ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో కుదిరిన డీల్‌లో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపి వేస్తుందని.. దానికి బదులుగా అమెరికా లేదా వెనిజులా నుంచి చమురు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ తన ప్రకటనలో కేవలం సుంకాల తగ్గింపు గురించి మాత్రమే ప్రస్తావించారు. కానీ రష్యా చమురు నిలిపివేతపై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ దీనిపై రష్యా స్పందించి భారత్ తమ చమురును కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదని.. వివరించింది. అలాగే రష్యా-భారత్ మధ్య ఉన్న ఇంధన భాగస్వామ్యం అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వానికి అవసరమని మాస్కో నొక్కి చెప్పింది.


రష్యా చమురుపై భారత్ ఎంతగా ఆధారపడింది?


2021 వరకు భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే ఉండేది. కానీ 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాయితీ ధరకు రష్యా చమురు లభించడంతో భారత్ తన కొనుగోళ్లను భారీగా పెంచింది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో సుమారు మూడో వంతు అంటే 35 శాతం రష్యా నుంచే వస్తోంది. ప్రతిరోజూ సుమారు 1.3 నుంచి 1.5 మిలియన్ బారెళ్ల రష్యా చమురు భారత రిఫైనరీలకు చేరుతోంది.


పూర్తిగా నిలిపివేయడం సాధ్యమేనా?


అమెరికా నుంచి వచ్చే చమురు రకానికి, రష్యా నుంచి వచ్చే చమురుకు మధ్య వ్యత్యాసం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రష్యా చమురును పూర్తిగా నిలిపివేసి అమెరికా చమురుకు మారాలంటే భారత రిఫైనరీల సాంకేతికతలో మార్పులు చేయాల్సి ఉంటుందని.. ఇది అదనపు ఖర్చుతో కూడుకున్న పని చెబుతోంది. అంతేకాకుండా అమెరికా ఒక్కటే రష్యా ఇచ్చే భారీ పరిమాణాన్ని సరఫరా చేయడం కూడా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందా లేక ట్రంప్ చెప్పినట్లుగా ఆపేస్తుందా అనేది.

Latest News
Sorloth's hat-trick take Atletico Madrid in Champions League last 16 Wed, Feb 25, 2026, 10:40 AM
Ranji Trophy Final: Yawer, Pundir's fifties take J&K to 178/2 at tea against Karnataka on Day 1 Tue, Feb 24, 2026, 04:14 PM
Cartel boss killing sparks chaos in Mexico Tue, Feb 24, 2026, 03:55 PM
Bomb threat email triggers panic at Bengal court, hoax suspected Tue, Feb 24, 2026, 03:46 PM
Three members of a family die by suicide in Hyderabad Tue, Feb 24, 2026, 03:42 PM