ఇంత నీచంగా. దిగజారిపోతారా? ట్రంప్‌పై తీవ్ర విమర్శలు
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 09:43 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా , ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాలను కోతులుగా చిత్రీకరిస్తూ రిపబ్లిక్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వీడియో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యం ట్రూత్ సోషల్ పోస్ట్ చేస్తూ.. మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆరోపణలు చేశారు. బ్యాలెట్ లెక్కింపు కంపెనీ డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ 2020 ఎన్నికల్లో తన విజయాన్ని లాక్కోడానికి సహాయపడిందని ఆరోపించారు. వీడియో చివరలో ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించారు. కోతుల శరీరాలకు మాజీ అధ్యక్ష దంపతుల ముఖాలను అతికించారు. బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్లీ ఒబామా కనిపించే వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ది లైన్ స్లీప్స్ టునైట్’ అనే పాటను పెట్టారు.


ఈ వీడియోపై కాలిఫోర్నియా గవర్నర్, ట్రంప్‌పై తరుచూ విమర్శలు గుప్పించే గవిన్ న్యూసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ నేత ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్నవారిలో గవిన్ ఒకరు. ‘అధ్యక్షుడి ప్రవర్తన అత్యంత అసహ్యకరమైంది.. ప్రతి రిపబ్లికన్ దీనిని ఖండించాలి’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.


అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడైన బెన్ రోడెస్‌ స్పందిస్తూ.. ట్రంప్ చరిత్రకు మాయని మచ్చలాంటివారని, అతడి అనుచరులు కూడా ‘జాత్యహంకార’ అని కూడా ముద్ర వేశారని అన్నారు. ‘భవిష్యత్ అమెరికన్లు ఒబామాను ప్రియమైన వ్యక్తులుగా ఆలింగనం చేసుకుంటారని, అదే సమయంలో ఆయనను మన చరిత్రపై ఒక మచ్చగా చూస్తారు.. ట్రంప్, అతడి జాత్యహంకార అనుచరులను వెంటాడుతారు’ అని అన్నారు


అయితే, ట్రంప్ గతంలోనూ ప్రపంచ నాయకులను ఏఐ వీడియోల సాయంతో ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది కూడా ఒబామాను ఒవెల్ ఆఫీసులో అరెస్ట్ చేస్తున్నట్టు ఓ వీడియో రూపొందించారు. మరో నల్లజాతి నాయకుడు హకీమ్ జెఫ్రీస్‌ వ్యగ్యంగా చిత్రీకరించారు. అమెరికా చరిత్రలో ఏకైక నల్లజాతి అధ్యక్షుడిగా ఒబామా రికార్డులకు ఎక్కారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌‌కు మద్దతుగా ప్రచారం చేశారు.

Latest News
Govt introduces 4 digital tools for Census-2027, over 30 lakh officials to be deployed Thu, Mar 05, 2026, 03:15 PM
Omnitech Engineering shares list at Rs 205, nearly 10 pc below IPO price Thu, Mar 05, 2026, 03:02 PM
Gujarat BJP chief inaugurates Rs 97 crore-worth civic projects in Ahmedabad Thu, Mar 05, 2026, 03:00 PM
T20 WC: Chakravarthy will be the most dangerous bowler against Brook, says Pujara Thu, Mar 05, 2026, 03:00 PM
India's industrial, warehousing demand rises 29 pc in 2025 Thu, Mar 05, 2026, 02:47 PM