డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇక అంత వీజీ కాదు....ఏపీలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ముఖ్య గమనిక. ఏపీలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు అందుబాటులోకి రానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా.. ఏపీ ప్రభుత్వం కలిసి ఏపీలో నాలుగు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు ఏర్పాటు చేయనున్నారు. ఏలూరు, ఒంగోలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలోని ఆర్టీవో కార్యాలయాల వద్ద ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నారు. మారుతి సుజుకీ ఇండియా ఈ ట్రాకులను మూడేళ్లపాటు నిర్వహించనుంది. డ్రైవింగ్ మీద మంచి పట్టు వారే డ్రైవింగ్ లైసెన్సులు పొందేలా.. ఈ విధానం తీసుకువస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యా్ప్తంగా రహదారి భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టు ట్రాకులు ఏర్పాటు, నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మారుతి సుజుకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఏలూరు, విజయనగరం, ఒంగోలు, అనకాపల్లిలోని రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను అందుబాటులోకి తెచ్చిన నాటి నుంచి మూడేళ్ల పాటు.. ఈ ట్రాకులకు కావాల్సిన ఆటోమేషన్, నిర్వహణ చూసేలాఏపీ ప్రభుత్వం మారుతి సుజుకీ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులలో మానవ ప్రమేయం ఉండదు. నైపుణ్యం కలిగిన వ్యక్తులే డ్రైవింగ్ లైసెన్సులు పొందేలా ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు.


మరోవైపు ఈ నాలుగు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు ద్వారా లైట్ మోటార్ వెహికల్స్, టూవీలర్లకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. మరోవైపు ఒంగోలులో ఏర్పాటు చేసే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద హెవీ మోటార్ వాహనాలకు కూడా లైసెన్సులు జారీ చేయనున్నారు. మరోవైపు విశాఖపట్నంలో ఇప్పటికే ఇలాంటి ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. గంభీరమ్ వద్ద ఇలాంటి ట్రాక్ ఏర్పాటు చేశారు.


ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్.. అంటే ఏమిటి?


ఈ విధానంలో సెన్సార్ల ద్వారా ఎలక్ర్టానిక్ విధానంలో డ్రైవింగ్ మీద పర్యవేక్షణ ఉంటుంది. ట్రాక్ మొత్తం సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. ఈ సెన్సార్లు వాహనం ప్రతి కదలికను పసిగడుతూ ఉంటాయి. ఏ మాత్రం తడబడినా పసిగట్టేస్తున్నాయి. దీంతో ఏ చిన్న తప్పు చేసినా డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ బాగా నేర్చుకున్నవారికే లైసెన్సులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Latest News
West Asia crisis: Passengers returning from Muscat say situation in Oman remains normal Fri, Mar 06, 2026, 01:15 PM
Earlier we had Jadeja and Axar is filling that void well: Gavaskar Fri, Mar 06, 2026, 01:03 PM
T20 WC: 'Bumrah is a superpower that any captain will dream of,' says Du Plessis Fri, Mar 06, 2026, 12:44 PM
Five injured as car crashes into multiple vehicles in Gujarat's Surat Fri, Mar 06, 2026, 12:44 PM
Pakistani forces kill three more civilians in Balochistan as cycle of persecution continues Fri, Mar 06, 2026, 12:39 PM