హోలీకి ముందే ఉద్యోగులకు డీఏ పెంపు?.... ఎంత జీతంపై ఎంత
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:05 PM

పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం.. ఏటా రెండు సార్లు తమ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA- కరవు భత్యం), డీఆర్ వంటివి పెంచుతుంటుందన్న సంగతి తెలిసిందే. డీఏ అనేది ఉద్యోగులకు.. డీఆర్ అనేది పెన్షనర్లకు వర్తిస్తుంది. ప్రతిసారీ మార్చిలో హోలీ సమయంలో ఒకసారి.. దీపావళి సమయంలో అక్టోబరు/నవంబరులో ఒకసారి ప్రకటిస్తుంటుంది. ఆలస్యంగా ప్రకటించినా ఈ పెంపు మాత్రం జనవరి 1, జులై 1 నుంచే అమల్లోకి వస్తుంటుంది. అంటే దీనికి తగ్గట్లుగా ఇక్కడ అరియర్స్ (బకాయిలు) కలిపి చెల్లిస్తారని చెప్పొచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వర్కర్స్- వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం లెక్కల ఆధారంగా డీఏ, డీఆర్ లెక్కిస్తారు.


>> ఇక్కడ డీఏ అనేది కూడా వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుంది. ఇప్పటికే గతేడాది డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగిసినా.. ఇంకా 8వ వేతన సంఘం అమల్లోకి రాలేదు. దీనికి మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు 7వ వేతన సంఘం సిఫార్సులే అమల్లో ఉంటాయి. కాబట్టి.. దీనికి అనుగుణంగానే డీఏ లెక్కిస్తారని చెప్పొచ్చు.


 డీఏ, డీఆర్ పెంచినా ఇది బేసిక్ శాలరీపైనే వర్తిస్తుంది. దీనికి అనుగుణంగానే చేతికి అందే శాలరీ పెరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి.. AICPI-IW లెక్కల ప్రకారం డీఏ 2 శాతం మాత్రమే పెరగాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉండగా.. ఇది 60 శాతానికి చేరుతుందన్నమాట. ఈసారి హోలీకి ముందే దీనిపై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక అంతకుముందు జూన్ నెలలో మాత్రం డీఏను 55 శాతం నుంచి 3 శాతం పెంచి 58 శాతానికి చేర్చారు. దానికి ముందు కూడా చాలా వరకు డీఏ 3 శాతం లేదా 4 శాతం వరకు పెరిగింది. ఈ సారి మాత్రం 2 శాతం మాత్రమే ఉంటుందన్న సంకేతాలతో ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశ చెందుతున్నారు.


>> ఇప్పుడు మనం కొన్ని బేసిక్ పే లపై ఈ డీఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బేసిక్ శాలరీ రూ. 20 వేలుగా ఉన్నట్లయితే 58 శాతం డీఏ ప్రకారం.. ఇది రూ. 31,600 జీతం చేతికి వచ్చేది. ఇప్పుడు మరో 2 శాతం పెరిగితే ఈ మొత్తం రూ. 32 వేలకు చేరుతుంది. ఇదే రూ. 30 వేల బేసిక్ పే పై రూ. 47,400 నుంచి రూ. 48 వేలకు చేరుతుంది. 40 వేల బేసిక్ పే ఉంటే 58 శాతం డీఏ లెక్కన ఇది రూ. 63,200 గా ఉంటే.. 60 శాతానికి చూస్తే రూ. 64 వేలకు చేరుతుంది. ఇక 50 వేల బేసిక్ పే బై హ్యాండ్ శాలరీ రూ. 1000 పెరిగి రూ. 80 వేలకు చేరుతుంది. ఇదే లక్ష బేసిక్ పే ఉన్నట్లయితే 58 శాతం బేసిక్ పే పై రూ. 1,58,000 గా ఉండగా.. ఇప్పుడు రూ. 1.60 లక్షలకు చేరనుంది. అంటే రూ. 2 వేలు పెరుగుతుందన్నమాట. ఇదే విధంగా డీఆర్ అంటే పెన్షనర్లకు పింఛన్ లెక్కలు కూడా చేసుకోవచ్చు.

Latest News
Chartered plane to bring home South Koreans from UAE on Sunday Sat, Mar 07, 2026, 02:21 PM
Gujarat: Free medicines in govt hospitals doubled in two years after Essential Drugs List expansion Sat, Mar 07, 2026, 02:19 PM
Trump privately weighs small US ground forces in Iran Sat, Mar 07, 2026, 02:17 PM
Air India, IndiGo plan special Gulf flights to bring back stranded passengers Sat, Mar 07, 2026, 02:09 PM
T20 WC: 'You just have to control your emotions and express yourself,' says Piyush Chawla on handling pressure in final Sat, Mar 07, 2026, 01:04 PM