గుడ్లు తింటే ఈ అద్భుత లాభాలు మీ సొంతం!
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:20 PM

రోజూ ఒకటి, రెండు గుడ్లు తినడం వల్ల శరీరంలో 4 అద్భుతమైన మార్పులు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా మారి, కండరాలు బలపడతాయి. కోలిన్ అనే పోషకం మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడుతుంది. గుడ్లు తినడం వల్ల శరీరానికి మేలు చేసే HDL కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, ఉదయం పిండి పదార్థాలకు బదులు గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, రోజంతా శక్తి లభిస్తుంది. అయితే, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి  తీసుకోవడం మంచిది.

గుడ్లను ఎలా తీసుకుంటే అదనపు ప్రయోజనం
గుడ్లను ఉల్లిగడ్డతో కలిపి వండితే శరీరం టాక్సిన్ తొలగించే మార్గాలు మెరుగవుతాయి.
మిరియాలు, సముద్ర ఉప్పు వేసి తినడం వల్ల కారోటెనాయిడ్ మెరుగవుతుంది.


పచ్చగా గుడ్ల పచ్చసొనను కొంచెం మగ్గిన స్థితిలో వదిలి ఉంచితే వేడి-సున్నితమైన పోషకాలు ఎక్కువగా నిలుస్తాయి.


“రోజుకు 3-4 గుడ్లు తినడం అనేది ఎక్కువేం కాదు.. ఒక మంచి పోషక (nutritional foundation) ఆహారాన్ని శరీరానికి అందివ్వడం జరుగుతుంది అంతే. ఇది హార్మోన్ల, మెదడు ఆరోగ్యం, మెటాబాలిక్ ఫంక్షన్, లివర్ పనితీరును, కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలసట అనేది ఉండదు. సెల్యులర్ రిపేర్‌కు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Latest News
CBI summons TVK leader Vijay again in Karur stampede probe Mon, Mar 09, 2026, 03:31 PM
No major impact on India due to rise in global oil price: FM Sitharaman Mon, Mar 09, 2026, 03:28 PM
T20 WC: Emotional Ishan Kishan dedicates trophy triumph to late cousin sister Mon, Mar 09, 2026, 03:23 PM
Houston tribute to 'Vande Mataram' at 150 Mon, Mar 09, 2026, 03:22 PM
India processing Russian oil is pragmatic decision: US Mon, Mar 09, 2026, 03:07 PM