నేను ఎప్పుడు సీఎం అవుతానో కాలమే చెబుతుంది: డిప్యూటీ సీఎం శివకుమార్‌
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 02:36 PM

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై మరోసారి స్పందించారు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్నది కాలమే చెబుతుందని వ్యాఖ్యానిస్తూ, ఈ విషయంలో అనవసర ఊహాగానాలు అవసరం లేదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగే అన్ని నిర్ణయాలు పార్టీ హైకమాండ్‌ పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే తమ పూర్తి దృష్టి ఉందని డీకే శివకుమార్ తెలిపారు.మార్చి నెలలో 100 కాంగ్రెస్ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఏఐసీసీ తేదీలు ఇచ్చినా ఇవ్వకున్నా పనులను ప్రారంభిస్తానని చెప్పారు. పుత్తూరులో కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం కోసం తాను ఇక్కడకు వచ్చినట్టు మీడియాకు తెలిపారు. కేపీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మార్చి 10వ తేదీతో ఆరేళ్ల పూర్తవుతాయని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ భవనాల నిర్మాణం పనులను ప్రారంభించనున్నామని చెప్పారు.

Latest News
Body of soldier missing after river crossing exercise in J&K, recovered Tue, Mar 10, 2026, 03:00 PM
India's annual food exports nearing Rs 5 lakh crore mark: Piyush Goyal Tue, Mar 10, 2026, 02:52 PM
Number of phases in Bengal polls will depend on ground-level law & order preparedness: CEC Tue, Mar 10, 2026, 02:49 PM
Naveen Patnaik criticises Odisha govt's indifference, demands immediate rescue of Odias Tue, Mar 10, 2026, 02:36 PM
Job postings in India remain 84 pc above pre-pandemic levels: Report Tue, Mar 10, 2026, 02:30 PM