రేష‌న్ కార్డుదారుల ఖాతాలోకి నేరుగా డ‌బ్బులు ?
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:28 PM

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని తీసుకువస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారని ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీలల్ ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ వోచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతి నెలా వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్‌తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

Latest News
Pakistan: Aurat March leaders accuse police of 'manhandling' protesters, demand probe Tue, Mar 10, 2026, 04:29 PM
Fair tax system fosters inclusive growth: President Murmu Tue, Mar 10, 2026, 04:27 PM
Pakistan's ISI targetting Chinese investment projects in Afghanistan, warns expert Tue, Mar 10, 2026, 03:35 PM
PM Modi to visit Assam; HM Shah to address mega BJP youth conference Tue, Mar 10, 2026, 03:20 PM
BJP flags doctors' strike threat in Assembly; Karnataka govt assures of talks soon Tue, Mar 10, 2026, 03:15 PM