ట్రేడ్‌ డీల్‌ గురించి ఏడాదిపాటు చర్చలు: పీయూష్‌ గోయల్
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:42 PM

ట్రేడ్‌ డీల్‌ గురించి ఏడాదిపాటు చర్చలు జరిగాయని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ తెలిపారు. 'అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి టారిఫ్‌లు తగ్గించింది. చాలా ఉత్పత్తులపై ఎగుమతుల టారిఫ్‌ జీరో అయింది. రైతులకు, వ్యవసాయానికి ఈ డీల్‌ రక్షణ కవచంగా మారింది. చాలా కూరగాయలు, విత్తనాలకు టారిఫ్‌ లేదు. ఈ రోజుని సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఈ డీల్‌తో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం లేదు' అని తెలిపారు.మన ఉత్పత్తులపై సుంకం 18 శాతం. ఇది పొరుగు దేశాలతో పోలిస్తే మెరుగు’ అని తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. చైనా వస్తువులపై 35 శాతం, వియత్నాం, బంగ్లాదేశ్ వస్తువులపై 20 శాతం, ఇండోనేషియా వస్తువులపై 19 శాతం చొప్పున అమెరికా సుంకాలు విధిస్తోందని అన్నారు. భారత ఎగుమతిదారులు అనేక వస్తువులను ఎలాంటి సుంకాల బెడద లేకుండా అమెరికాకు ఎగుమతి చేయొచ్చని చెప్పారు.పలు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ఎలాంటి సుంకాలు ఉండని చెప్పారు. మసాలాదినుసులు, టీ, కాఫీ, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు రకాల పండ్లు, కూరగాయాలను సుంకాల బెడద లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి వివరించారు.

Latest News
Pakistan: Aurat March leaders accuse police of 'manhandling' protesters, demand probe Tue, Mar 10, 2026, 04:29 PM
Fair tax system fosters inclusive growth: President Murmu Tue, Mar 10, 2026, 04:27 PM
Pakistan's ISI targetting Chinese investment projects in Afghanistan, warns expert Tue, Mar 10, 2026, 03:35 PM
PM Modi to visit Assam; HM Shah to address mega BJP youth conference Tue, Mar 10, 2026, 03:20 PM
BJP flags doctors' strike threat in Assembly; Karnataka govt assures of talks soon Tue, Mar 10, 2026, 03:15 PM