ఏపీ పదో తరగతి ఇంగ్లీషు పరీక్ష తేదీలో మార్పు
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 05:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఒక్క పరీక్ష తేదీ మినహా మిగిలిన అన్ని పరీక్షల షెడ్యూల్‌ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.కాగా, పదో తరగతి పరీక్షలు ముందుగా నిర్ణయించినట్లుగానే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సవరించిన పూర్తి టైమ్ టేబుల్‌ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inను సందర్శించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు

Latest News
Pakistan: Aurat March leaders accuse police of 'manhandling' protesters, demand probe Tue, Mar 10, 2026, 04:29 PM
Fair tax system fosters inclusive growth: President Murmu Tue, Mar 10, 2026, 04:27 PM
Pakistan's ISI targetting Chinese investment projects in Afghanistan, warns expert Tue, Mar 10, 2026, 03:35 PM
PM Modi to visit Assam; HM Shah to address mega BJP youth conference Tue, Mar 10, 2026, 03:20 PM
BJP flags doctors' strike threat in Assembly; Karnataka govt assures of talks soon Tue, Mar 10, 2026, 03:15 PM