అట్టహాసంగా ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:52 PM

నరసరావు పేట, ఫిబ్రవరి 7 : శనివారం ఉదయం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి చేతుల మీదుగా కొండవీడు ఫెస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్ పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు, రాష్ట్ర శిల్పారామం సాంస్కృతిక సొసైటీ చైర్ పర్సన్ మంజుల రెడ్డి, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండవీడు కోటను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. కొండవీడు కోట ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. ప్రముఖ చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి కొండవీడు రెడ్డిరాజుల చరిత్ర గురించి వివరించారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, సైకత కళా రూపాల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాలు సరదాగా బోటింగ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా హెలీ రైడ్ లో కొండవీడు కోటను తిలకించారు.  కొండవీడు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, పర్యాటకులు వేలాదిగా తరలిరావడంతో కొండవీడు కోట ప్రాంగణం కిటకిటలాడింది. పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఉల్లాసంగా గడిపారు.

Latest News
India ranks 3rd in global cross-border employment, accounts for 7 pc of AI trainers Thu, Mar 12, 2026, 04:29 PM
Vijay, Annamalai attack DMK govt over women's safety in TN Thu, Mar 12, 2026, 04:23 PM
93 pc of workforce at India's GCCs is Gen Z and millennial: Report Thu, Mar 12, 2026, 03:00 PM
MI vs RCB is going to be a houseful, won't get a bigger match than this: Pathan Thu, Mar 12, 2026, 02:53 PM
Consumers hit as prices of daily goods surge in Pakistan, shopkeepers blame petrol costs Thu, Mar 12, 2026, 02:45 PM