ఆరోగ్యానికి లోహపు, మట్టి పాత్రలే శ్రేయస్కరం
 

by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:00 PM

మన శరీరంలో 70 శాతం నీరే ఉంటుంది. లోహపు, మట్టి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా నశించి, అదనపు పోషకాలు అందుతాయి. ఇత్తడి పాత్రలు చర్మ, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మట్టి పాత్రలు నీటిని చల్లబరచి, pH సమతుల్యతను కాపాడి, ఖనిజాలను అందిస్తాయి. వెండి పాత్రలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, రాగి పాత్రలు జీర్ణక్రియను మెరుగుపరిచి, థైరాయిడ్ సమస్యలను అదుపు చేస్తాయి. ప్లాస్టిక్ కంటే మట్టి, లోహపు పాత్రలే శ్రేయస్కరం. నాణ్యమైన పాత్రలను ఎంచుకుని, క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో జిడ్డు, మొటిమల సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. వీటి నుండి చర్మాన్ని కాపాడుకోవటానికి కూడా మట్టి కుండలో నీళ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

Latest News
India ranks 3rd in global cross-border employment, accounts for 7 pc of AI trainers Thu, Mar 12, 2026, 04:29 PM
Vijay, Annamalai attack DMK govt over women's safety in TN Thu, Mar 12, 2026, 04:23 PM
93 pc of workforce at India's GCCs is Gen Z and millennial: Report Thu, Mar 12, 2026, 03:00 PM
MI vs RCB is going to be a houseful, won't get a bigger match than this: Pathan Thu, Mar 12, 2026, 02:53 PM
Consumers hit as prices of daily goods surge in Pakistan, shopkeepers blame petrol costs Thu, Mar 12, 2026, 02:45 PM