|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:37 PM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ బంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు తమ హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి అండగా నిలుస్తారని ఆయన భరోసా ఇచ్చారు. ముంబైలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ముంబైలోని వర్లీలో ఉన్న నెహ్రూ సెంటర్‌లో ‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ న్యూ హొరైజన్స్’ పేరిట రెండు రోజుల కార్యక్రమం జరిగింది. రెండో రోజైన ఆదివారం భగవత్ ప్రసంగించారు.బంగ్లాదేశ్‌లో సుమారు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారు అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వారికి సహాయం చేస్తారు అని ఆయన స్పష్టం చేశారు.ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన 'జూలై తిరుగుబాటు మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత ఈ హింస మరింత పెరిగిందన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది హిందువులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.ఇదే సందర్భంగా భారత్‌పై కూడా భగవత్ మాట్లాడారు. దేశంలో జనాభా మార్పులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.ఇప్పుడు భారత్‌ను ఎవరూ బలహీనపరచలేరు. దేశాన్ని విడగొట్టాలని చూసేవారే విడిపోతారు అని ఆయన హెచ్చరించారు. సంఘ్ ఎవరికీ వ్యతిరేకం కాదని అధికారం కోసం పనిచేయదని మరెవరినో నడిపించే రిమోట్ కంట్రోల్ అంతకన్నా కాదని పునరుద్ఘాటించారు. సంఘ్ నిధులు స్వయంసేవకుల నుంచే వస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పదవికి కులంతో సంబంధం లేదని భగవత్ స్పష్టం చేశారు
Latest News