|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 08:33 PM
యూపీఐ పరిచయంతో దేశంలో బ్యాంకింగ్ రంగం పూర్తిగా మారిపోయింది. చిన్న మొత్తపు లావాదేవీల కోసం కూడా బ్యాంక్‌కి వెళ్లి గంటలపాటు క్యూలో నిలవాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇప్పుడు కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఏ బ్యాంక్ పని అయినా చేసుకోవచ్చు. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త రకమైన ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తిగా డిజిటల్‌గా వాడవచ్చు.ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో KYC ద్వారా కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ఖాతా ప్రారంభించవచ్చు. ఓపెన్ చేసిన వెంటనే డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చు. నాన్-ఫినాన్షియల్ కంపెనీలే కాకుండా, పెద్ద బ్యాంకులు కూడా ఈ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను అందిస్తున్నాయి, కాబట్టి ఇవి సురక్షితమైనవి.ఈ అకౌంట్లు RBI నియంత్రణలో నడుస్తాయి, అందువల్ల మీ డబ్బు పూర్తిగా రక్షణలో ఉంటుంది. పొదుపు ఖాతాలకు RBI నిబంధనల ప్రకారం రూ.5 లక్షల డిపాజిట్ ఇన్షూరెన్స్ లభిస్తుంది. మీరు వీడియో KYC పూర్తి చేసిన వెంటనే, ఖాతా వివరాలు ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అందించబడతాయి. అలాగే, వెంటనే డిజిటల్ వర్చువల్ డెబిట్ కార్డును కూడా పొందవచ్చు.ఇప్పటికీ ఫిజికల్ డెబిట్ కార్డు కావాలంటే, దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, సుమారు వారం రోజుల్లో కార్డు ఇంటికి డెలివరీ అవుతుంది. ఈ డిజిటల్ ఖాతాలను జీరో బ్యాలెన్స్‌తో కూడా ఓపెన్ చేయవచ్చు.కొన్ని డిజిటల్ ఖాతాలకు సంబంధించి డెబిట్ కార్డు మరియు ఇతర సౌకర్యాలపై పరిమితులు ఉండవచ్చు. అయితే, పూర్తి వీడియో KYC పూర్తి చేస్తే, అన్ని సౌకర్యాలను పూర్తిగా ఉపయోగించవచ్చు.
Latest News