ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి
 

by Suryaa Desk | Sun, Feb 08, 2026, 09:10 PM

ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో వీటికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని మూడు ప్రధాన కోళ్ల ఫారాల్లో సుమారు 28 వేల కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయినట్లు తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.


ఇందులో భాగంగా ప్రస్తుతం బతికున్న కోళ్లను కూడా నిర్మూలించే ప్రక్రియను చేపట్టారు. ఊరి వెలుపల జేసీబీ సాయంతో భారీ గుంతలు తీసి.. శాస్త్రీయ పద్ధతిలో వాటిని పూడ్చివేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మార్వో స్పందిస్తూ.. వ్యాధి ప్రబలిన మూడు కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోళ్ల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దని ఎమ్మార్వో సూచించారు.


రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ గోదావరి జిల్లాలు, నెల్లూరు, కోస్తా జిల్లాల్లో ఈ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి, తద్వారా పౌల్ట్రీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ వైరస్ మానవులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా హై అలర్ట్ ప్రకటించింది. పౌల్ట్రీ ఫారాల యజమానులు బయో-సెక్యూరిటీ చర్యలు పెంచాలని సూచించింది. కోళ్లు అసాధారణంగా చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాంసం, గుడ్లు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు.


Latest News
Virat Kohli reaches Bengaluru ahead of IPL 2026, netizens say, 'The king arrived in his kingdom' Wed, Mar 18, 2026, 03:34 PM
Back in fray, Dilip Ghosh eyes 1 lakh votes in Kharagpur Sadar Wed, Mar 18, 2026, 03:22 PM
India eyes global leadership in 6G standards: Scindia Wed, Mar 18, 2026, 03:19 PM
Over 500 girls from minority communities abducted, forcefully converted in Pakistan: Rights body Wed, Mar 18, 2026, 03:17 PM
ICC Rankings: Mehidy climbs to No. 2 among ODI all-rounders; Santner gains big in T20I Wed, Mar 18, 2026, 03:12 PM