|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 10:20 PM
మన శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గితే, మొదట చిన్న నొప్పులు వస్తాయి కాబట్టి లైట్‌గా తీసుకుంటాం. కానీ తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల సమస్యలు, నడుము నొప్పి మొదలవుతాయి.కాల్షియం అంటే కేవలం ఎముకలకు మాత్రమే అవసరమని అనుకోవడం సరిగ్గా కాదు. ఇది కండరాల కదలిక, గుండె రిథమ్, రక్తసంచారం కోసం కూడా చాలా ముఖ్యం. మాత్రల అవసరం లేకుండా సహజంగా కాల్షియం పెంచుకోవాలంటే, మన వంటగదిలోని నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఒక అద్భుతమైన సహాయక మందిగా పనిచేస్తాయి.
*నల్ల నువ్వుల అద్భుత ప్రయోజనాలు:
1. ఎముకలకు బలాన్ని అందిస్తుంది: నల్ల నువ్వుల్లో కాల్షియం, మాగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. కీళ్ల నొప్పి, నడుము నొప్పి ఉన్నవారికి నేచురల్ టానిక్‌గా పనిచేస్తాయి.
2. జుట్టు రాలడాన్ని ఆపుతుంది: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవారికి నల్ల నువ్వులు గొప్ప వరం. ఇవి జుట్టును బలంగా, ఆరోగ్యవంతంగా చేస్తాయి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును అరికడతాయి, స్కాల్ప్‌లో డాండ్రఫ్ రాకుండా చేస్తాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు లోపలి నుంచి పోషణ ఇస్తాయి.
3. రక్తహీనతను తగ్గిస్తుంది:ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. రక్తహీనత (Anemia) ఉన్నవారికి ఇవి సహాయం చేస్తాయి.
4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:నల్ల నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం దూరమవుతుంది, గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపులో తీసుకుంటే మెటబాలిజం యాక్టివ్ అవుతుంది.
5. గుండె & మహిళల ఆరోగ్యం:కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, రక్తపోటును తగ్గిస్తాయి. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, డెలివరీ తర్వాత బలహీనత తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
*ఎలా తీసుకోవాలి?
♦ రోజుకు 10–20 గ్రాముల నువ్వులు సరిపోతాయి.
♦ నేరుగా తినవచ్చు లేదా కొద్దిగా వేయించి తేనెతో కలిపి తీసుకోవచ్చు.
♦ పొడిలా చేసి అన్నంలో కలపవచ్చు లేదా నువ్వుల లడ్డు రూపంలో తీసుకోవచ్చు.
*గమనిక: నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే నోటి పూత, జీర్ణ సమస్యలు రావచ్చును. కాబట్టి మితంగా తీసుకోవాలి.