|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 11:22 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రులు, కార్యదర్శుల సమీక్ష సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 వరకు ఈ సమీక్ష కొనసాగనుంది.ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ప్రత్యక్షంగా హాజరవుతారు, అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ ఫార్మాట్‌లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి జీఎస్డీపీ వృద్ధి రేటు, “స్వర్ణాంధ్ర 2047” విజన్ లక్ష్యాల క్రింద పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సమీక్షించనున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా చర్చ జరుగనుంది.రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం భాగంగా, అవేర్, డేటా అనలిటిక్స్, ఏఐ టూల్స్ వంటి సాంకేతికతలను పాలనలో ఎలా వినియోగించాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం ఇవ్వనున్నారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, “వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్” విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే రాష్ట్ర శాంతిభద్రతల అంశాలపై కూడా సమీక్ష జరుగనుంది.2026-27 ఆర్థిక సంవత్సరానికి శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన మార్గనిర్దేశం అందిస్తారు.
Latest News