గూగుల్ ఉద్యోగుల ఆగ్రహం..
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:54 AM

గూగుల్ సంస్థలో అంతర్గత అలజడి. అమెరికా ప్రభుత్వ విభాగాలైన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ లతో గూగుల్ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. గూగుల్ సాంకేతికత హింసకు, నిఘాకు, అణచివేతకు సాధనంగా మారుతోందని, ముఖ్యంగా క్లౌడ్, ఏఐ వినియోగం వలసదారులను ట్రాక్ చేయడానికి, సరిహద్దు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలతో ఉన్న అన్ని ఒప్పందాలను బహిర్గతం చేసి, తక్షణమే వాటి నుంచి గూగుల్ వైదొలగాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.కేవలం క్లౌడ్ సేవలే కాకుండా.. గూగుల్ జనరేటివ్ ఏఐ కూడా ప్రభుత్వ విభాగాల సామర్థ్యాన్ని పెంచేందుకు వాడటంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో ఐసీఈ రిక్రూట్‌మెంట్ ప్రకటనలు రావడం, అలాగే ఇమ్మిగ్రెంట్ల రక్షణ కోసం రూపొందించిన ట్రాకింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుండి తొలగించడం వంటి చర్యలను ఉద్యోగులు తప్పుబట్టారు. ఈ టెక్నాలజీలను రూపొందిస్తున్న ఉద్యోగులుగా.. తమ శ్రమ ఇలాంటి హింసాత్మక పనులకు ఉపయోగపడటం మమ్మల్ని భయపెడుతోందని లేఖలో పేర్కొన్నారు.

Latest News
Zomato increases platform fee by 19 pc to around Rs 15 per order Fri, Mar 20, 2026, 04:04 PM
Viksit Delhi@2047: Delhi L-G TS Sandhu calls on PM Modi Fri, Mar 20, 2026, 03:54 PM
CSK confirms Nathan Ellis' exit from IPL 2026 due to hamstring injury Fri, Mar 20, 2026, 03:32 PM
India scripting a decisive chapter in global energy landscape: PM Modi Fri, Mar 20, 2026, 02:59 PM
India's energy resilience: Managing LPG stability amid global turbulenc Fri, Mar 20, 2026, 02:56 PM