|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 12:51 PM
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఆందోళన సందర్భంగా దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మధ్యాహ్నం విచారణ జరపనుంది.గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో అంబటిని విచారించేందుకు పోలీసులు గుంటూరు కోర్టులో పీటీ (Prisoner Transit) వారెంట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
Latest News