|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 01:04 PM
అధికారంలోకి వచ్చిన 20 నెలలుగా ప్రజలకిచ్చిన ఏ హమీని అమలు చేయకుండా పాలన గాలికొదిలేసిన చంద్రబాబు పాలనలో తీవ్రంగా వైఫల్యం చెంది.. ఆ వైఫల్యాల గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టిని మరల్చేందుకు అవసరమైనప్పుడల్లా తిరుమల లడ్డూ పేరుతో కుట్రలు చేస్తున్నాడని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం లడ్డూ పేరుతో రాజకీయాలు చేస్తూ తిరుమల శ్రీవారి పవిత్రతను, హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నాడని ఆయన మండిపడ్డారు. కూటమి పార్టీలన్నీ ఒక్కటైనా ఒకే ఒక్క వైయస్ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు లడ్డూ పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో నిమగ్నమైన చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నాడని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ నే కల్తీ జరిగిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి కన్నబాబు గుర్తు చేశారు.
Latest News