|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 01:11 PM
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందిందని, క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు.
Latest News