|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:45 PM
రష్యాలోని ఉఫా మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో 15 ఏళ్ల టీనేజర్ కత్తితో విదేశీ విద్యార్థులపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులకు గాయాలయ్యాయి. నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై 'స్వస్తిక్' చిహ్నాలను గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దాడి జరుగుతుండగానే కొందరు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలోనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు పోలీస్ అధికారులను కత్తితో గాయపరిచాడు. అనంతరం తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అతడిని నిలువరించిన పోలీసులు వెంటనే బాధితులు, గాయపడిన పోలీసులు సహా నిందితుడిని సైతం ఆస్పత్రికి తరలించారు.
Latest News