|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:29 PM
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న సత్యనారాయణ సోమవారం రూ. 24 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇటీవల చేపట్టిన నిర్మాణ పనులకు చెల్లించాల్సిన బిల్లుల కోసం ఏఈని కాంట్రాక్టర్ కలువగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. పక్కా వ్యూహం ప్రకారం కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
Latest News