|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:29 AM
AP: టమాటా ధరలు రోజురోజుకీ పడిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆస్పరి, హొళగుందలో కేజీ టమాటా ధర కేవలం రూ.5కి పడిపోవడంతో, రైతులు తమ పంటను రోడ్లపైనే పడేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండలో ఇప్పటికే టమాటా కొనుగోళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు.టమాటా రైతులు ఏటా నష్టాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి లాభాలు వస్తుండటంతో ఆశతో టమాటాను పండించడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ టమాటా రైతు పరిస్థితి లాటరీలా మారింది. రైతుల్లో సరైన అవగాహన లేకపోవడం, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో ఏటా విఫలమవుతున్నారు. ప్రధానంగా టమాటా పండించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎన్ని ఎకరాల్లో వేయాలన్న దానిపై రైతుల్లో అవగాహన కల్పించినట్లయితే కొంత డిమాండ్ కు తగినట్లుగానే దిగుబడి వస్తుంది. అప్పుడు రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని పాలకులు బయటకు చెబుతున్నా అది ఆచరణ సాధ్యంలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
Latest News