|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:04 PM
బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ, చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకే అలవాటు పడిందని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి, కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు, కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు.
Latest News