|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నిన్న రాత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు లాంజ్ లో ఆయన పార్టీ ఎంపీలతో వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు, అదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... ఎయిర్ పోర్టులో చంద్రబాబు ఉన్నారనే విషయం తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీలోని 1-జన్ పథ్ (తన అధికారిక నివాసం)కు వెళ్లారు. సచిన్ ముంబైకి బయల్దేరారు.
Latest News