|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:55 PM
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో పాక్ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం రాను పోను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 15న సా.7 గంటలకు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఐసీసీ (ICC) మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ చెప్పాడు. శ్రీలంక ప్రధాని అనురకుమార కూడా పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడారని పాక్ ప్రభుత్వం వెల్లడించింది.
Latest News