|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:37 PM
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, ప్రభల తరలింపునకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్లను తీర్చిదిద్దాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు.ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్యూలైన్ లను పెంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులు పెంచాలన్నారు. భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు.
Latest News