భారీ టార్గెట్‌ను 10 వికెట్ల తేడాతో ఛేదించిన న్యూజిలాండ్,,,,టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్ వరుస విజయాలు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:01 PM

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో చిన్న టీమ్‌లు గట్టిపోటీనే ఇస్తున్నాయి. నెదర్లాండ్స్ మొదలు యూఏఈ వరకూ ఆడిన ప్రతీ జట్టు ప్రత్యర్థికి బలమైన పోటీనే ఇచ్చాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలింగ్‌లో విఫలమవ్వడంతో ఓటమిపాలయింది. అయినప్పటికీ యూఏఈ బ్యాటింగ్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 173/6 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.


చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ జట్టు కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన యూఏఈ ఆరంభంలోనే ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ వికెట్ కోల్పోయినా.. కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ - షరాఫుల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.


వసీమ్ - షరాఫుల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. కెప్టెన్ వసీమ్ 66, షరాఫుల్ 55 పరుగులు చేయడంతో యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించింది.


174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు డామినేటింగ్ బ్యాటింగ్‌తో యూఏఈ బౌలర్లను భయపటెట్టింది. పవర్ ప్లేలో 78 పరుగులు బాదిన కివీస్ ఓపెనర్లు జట్టు విజయాన్ని అక్కడే ఖరారు చేశారు. యూఏఈ బౌలర్లు న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్ వికెట్లు తీయడంలో విఫలం కావడంతో.. 15.2 ఓవర్లలోనే 175 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్నారు. టిమ్ సైఫర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. సైఫర్ట్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో కివీస్‌కు కీలక ఓపెనర్‌గా మారాడు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM