కాసులు కురిపిస్తోన్న స్టాక్ ఇదే,,,,లక్ష పెడితే రూ.5.16 లక్షలు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:16 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, దేశాల మధ్య యుద్ధాలతో పాటు విదేశీ మదుపరులు భారీగా అమ్మకాలకు దిగుతుండడంతో భారీగా పడుతూ లేస్తూ ట్రేడింగ్ చేస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఓ స్టాక్ అదరగొడుతోంది. తమ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 6 నెలల కాలంలోనే ఈ స్టాక్ 416 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. అదే టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ స్టాక్. ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


రూ.50 ధర లోపే లభించే మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ అయిన టేక్ సొల్యూషన్స్ షేరు దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన 4.51 శాతం మేర లాభపడి సరికొత్త ఆల్ టైమ్ హై స్థాయిని తాకింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.46.93 స్థాయిని ఇవాళే టచ్ చేయడం గమనార్హం. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.6.51గా ఉంది. అంటే ఏడాదిలోపే దాదాపు 600 శాతం మేర పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందాయని చెప్పవచ్చు. ఇంట్రాడేలో ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50లూ 0.2 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ ద్వారా సానుకూల ప్రభావంతో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్ మరింత పెరిగింది.


 ఈ స్మాల్ క్యాప్ స్టాక్ టేక్ సొల్యూషన్స్ లిమిటెడ్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.6.51ని 2025 ఏప్రిల్ నెలలోనే టచ్ చేసింది. ఆ తర్వాత వేగంగా కోలుకుని 591 శాతం మేర పెరిగింది. ఈ స్టాక్ తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 303 శాతం మేర లాభాలు ఇచ్చింది. ఇక గత ఆరు నెలల్లో చూసుకుంటే 416 శాతం మేర లాభపడింది. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.5.16 లక్షలకు పైగా అవుతాయి. అలాగే గత 3 నెలల కాలంలోనే పెట్టుబడిని దాదాపు డబుల్ చేసింది. 96 శాతం మేర లాభపడింది. ఇక గత నెల రోజుల్లో ఈ స్టాక్ 9 శాతం లాభాలు ఇచ్చింది.


టేక్ సొల్యూషన్స్ ఇటీవలే ఫ్యూచర్ ప్లాన్స్ ప్రకటించింది. ఏఐ ఆధారిత స్మార్ట్ డయాగ్నోస్టిక్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ యూనిట్ వన్ మినట్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. భారతీయ ప్రీవెంటివ్ హెల్త్ కేర్ రంగంలో తమ వ్యాపార విస్తరణ చేపట్టే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ ఏఐ స్మార్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సెబీ వద్ద దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ స్టాక్ మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. దీంతో ఈరోజు దాదాపు 5 శాతానికిపైగా పెరిగింది.


Latest News
Artemis II crew returns after historic moon mission Sat, Apr 11, 2026, 12:04 PM
Tamil Nadu Assembly elections: 4,023 candidates in fray after scrutiny, withdrawals Sat, Apr 11, 2026, 11:59 AM
Bengal LoP draws attention of ECI over contractual staff appointment as sector officers Sat, Apr 11, 2026, 11:58 AM
ED raids former education minister Partha Chatterjee's residence ahead of Bengal polls Sat, Apr 11, 2026, 11:57 AM
US, Iran head to high-stakes Islamabad talks Sat, Apr 11, 2026, 11:57 AM