|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:51 AM
రాష్ట్రంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలన్నింటినీ అధికార పార్టీ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.12 ద్వారా మళ్లీ దళారీ వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గతంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చిందని, దీని ద్వారా లక్ష మందికి పైగా చిరుద్యోగులకు రక్షణ లభించిందని తెలిపారు.
Latest News