|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:21 PM
Valentines Day 2026 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ iPhone 17పై ప్రత్యేక సర్‌ప్రైజ్ డీల్‌ను ప్రకటించింది. వాలెంటైన్స్ వీక్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు అందించిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఆఫర్స్ పేజీలో ప్రత్యేక టీజర్ ద్వారా ఈ డీల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా iPhone 17ను అన్ని ఆఫర్లతో కలిపి కేవలం రూ. 74,900కి పొందవచ్చని సంస్థ పేర్కొంది.ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 82,900 ధరతో లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 76,900కు తగ్గుతుంది.ఇది కాకుండా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ ఇస్తున్నట్లు చూపిస్తోంది. అయితే ఎక్కువ ఫోన్లకు రూ. 2,000 బోనస్ మాత్రమే వర్తిస్తున్నట్లు గమనించవచ్చు. ఈ కనీస ఎక్స్‌చేంజ్ బోనస్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే, మొత్తం తగ్గింపు సుమారు రూ. 8,000 వరకు ఉంటుంది. దీంతో తుది ధర రూ. 74,900కి పడిపోతుంది.iPhone 17 ముఖ్య ఫీచర్లు iPhone 17లో 6.3 ఇంచుల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. 3nm టెక్నాలజీపై రూపొందిన A19 చిప్‌తో ఇది పనిచేస్తుంది. ఫోన్‌లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. కెమెరా విభాగంలో 48MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, ముందువైపు 18MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4K Dolby Vision HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ తాజా iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
Latest News