|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:31 AM
ఏపీ శాసనమండలిలో కంపెనీలకు భూముల కేటాయింపుపై వైసీపీ, మంత్రి లోకేష్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలను మంత్రి లోకేష్ ఖండిస్తూ.. "వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయడమే వైసీపీ అజెండా. దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి.. విశాఖకు ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయి. పెట్టుబడులు రావాలంటే కంపెనీలకు భూములు ఇవ్వకపోతే ఎలా?. పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం తప్పా?" అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.ఏపీలో అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు.
Latest News