నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం
 

by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:54 AM

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత నవంబర్ 12న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా సీఐ విధులను అడ్డుకున్నారనే ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం పీటీ వారెంట్ ద్వారా అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, అంబటి రాంబాబును కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు దాఖలు చేసిన  కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, అంబటి రాంబాబు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Latest News
Elon Musk accuses OpenAI, Sam Altman of betraying nonprofit roots in court trial Wed, Apr 29, 2026, 11:59 AM
Indian golf stalwart Vijay Kumar passes away at 57; PGTI offers condolences Wed, Apr 29, 2026, 11:57 AM
Bengal 2nd phase polls: As time passes disturbance reported from various pockets Wed, Apr 29, 2026, 11:54 AM
Gujarat to set up tourist police stations in three districts to enhance visitor safety Wed, Apr 29, 2026, 11:51 AM
Over 40 pc of Australians say US, Israel most responsible for fuel crisis Wed, Apr 29, 2026, 11:46 AM